ఈ నెల 14 న రాష్ట్ర వ్యాప్తంగా మన బడి 'నాడు - నేడు' కార్యక్రమాన్ని ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంపై సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొలి విడతలో 15 వేల 715 పాఠశాలల్లో 'నాడు - నేడు' కార్యక్రమం చేపట్టనున్నట్లు.. దీనికోసం దాదాపు 3 వేల 500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్ పనులు, మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, సహా హైస్కూల్లో అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడల నిర్మాణం చేయాలని ఆదేశించారు. తల్లిదండ్రులతో ఏర్పడ్డ కమిటీల భాగస్వామ్యం తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం అమలు చేస్తున్నామని తెలిపారు. ఆ తర్వాత ఒక్కో ఏడాది తదుపరి తరగతుల్లో ఇంగ్లీషు విద్యా బోధన అమలు చేస్తామని చెప్పారు. ఇంగ్లిషు మాధ్యంలో బోధన జరిగినప్పటికీ తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. నాడు- నేడు కార్యక్రమంలో స్కూళ్లలో ఇంగ్లీషు ల్యాబ్స్ కూడా ఉండాలని ఆదేశించారు. జనవరి 1 నుంచి టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. డిసెంబర్‌లోగా పాఠ్యా ప్రణాళిక ఖరారు కావాలని ఆదేశించారు. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నడపాలని సీఎం నిర్దేశించారు.
''మన బడి.. నాడు - నేడును విజయవంతం చేయండి'' - cm jagan review on mana badi nadu neadu news
ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా మన బడి 'నాడు-నేడు' కార్యక్రమాన్ని ఒంగోలులో లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమన్నారు.
cm-jagan-video-conference-review-on-nadu-nedu-scheme