ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్ - corona effect on ap

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. కరోనా పరీక్షలు పెరిగినా కేసులు తగ్గుతున్నాయని... కొవిడ్‌ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపిన సీఎం... కరోనా నివారణ చర్యలపై చర్చించారు.

CM Jagan Video Conference on Covid Control Issues
సీఎం జగన్

By

Published : Sep 29, 2020, 4:59 PM IST

కరోనా రేటు 12 నుంచి 8.3 శాతానికి తగ్గడం మంచి పరిణామమని ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి... కరోనా నివారణ చర్యలపై చర్చించారు. కరోనా పరీక్షలు పెరిగినా కేసులు తగ్గుతున్నాయని సీఎం జగన్ వివరించారు. కొవిడ్‌ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‌

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. జనవరి వరకు వ్యాక్సిన్‌ వస్తుందనే పరిస్థితి కనిపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. 104కు ఫోన్‌ చేస్తే కరోనా పరీక్షలు, ఆస్పత్రుల వివరాలు అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 104కు మాక్‌ కాల్స్‌ చేసి పనిచేస్తుందా..? లేదా..? అనేది తనిఖీ చేయాలని ఆదేశించారు. 104కు ఫోన్‌ చేయగానే బెడ్‌ అందుబాటులో ఉందో..? లేదో..? అరగంటలో చెప్పాలని స్పష్టం చేశారు.

ఆరోగ్యశ్రీ కింద కొవిడ్‌కు ఉచిత వైద్యం అందిస్తున్న రాష్ట్రం మనదేనన్న జగన్... కొవిడ్‌ ఆస్పత్రుల జాబితా గ్రామ సచివాలయాల్లో ఉండాలని చెప్పారు. ఎంప్యానల్‌ ఆస్పత్రుల జాబితా కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. 104కు ఫోన్‌ చేస్తే కొవిడ్‌ చికిత్స వివరాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సిబ్బంది విధులకు వెళ్తున్నారా..? లేదా..? అని తరచూ తనిఖీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

37000 వేల బెడ్స్‌, 240 హాస్పిటల్స్‌లో ఫుడ్‌, శానిటేషన్, ఇన్‌ఫ్రా, స్టాఫ్‌ వీటిపై పర్యవేక్షణ పక్కాగా ఉండాలి. ప్రతీ రోజూ కలెక్టర్లు, జేసీలు పర్యవేక్షించాలి. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కూడా ఫుడ్, శానిటేషన్, మెడికేషన్‌ కచ్చితంగా జరగాలి. అక్కడ కూడా హెల్ప్‌ డెస్క్‌ ఉండాలి. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి కిట్లు ఇస్తున్నామా లేదా ప్రతీ ఒక్కరూ దృష్టిపెట్టాలి. కిట్లు రాలేదంటే కలెక్టర్లు, జేసీలు భాద్యత వహించాలి. ఏఎన్‌ఎంలు, లోకల్‌ డాక్లర్లు మ్యాపింగ్‌ చేయాలి, డాక్టర్‌ కూడా ఆ ఇంటికి వెళ్ళి చూడాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, పిహెచ్‌సీ డాక్టర్‌ ముగ్గురూ కచ్చితంగా వారితో మాట్లాడాలి. 104 నెంబర్‌ పబ్లిసిటీ కూడా బాగా జరగాలి. దానితో పాటు లోకల్‌ కంట్రోల్‌రూమ్‌ నెంబర్‌ కూడా పబ్లిసిటీ చేయాలి. కొవిడ్‌ భాదితులను త్వరగా గుర్తించడం వల్లే మరణాల సంఖ్య తగ్గుతుంది.-సీఎం జగన్

ఇదీ చదవండి:దేశంలో తగ్గిన కేసులు.. కొత్తగా 70,589 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details