సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై ప్రధాని అధ్యక్షతన 3 గంటలపాటు అఖిలపక్ష భేటీ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ చర్చించారు. అఖిలపక్ష సమావేశంలో 20 పార్టీల అధ్యక్షులు పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీలో కేంద్రానికి పార్టీల నేతలు పలు సూచనలు చేశారు.
ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తాం: సీఎం జగన్ - ముఖ్యమంత్రి జగన్
గాల్వన్ సంక్షోభ సమయంలో దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సరైన మార్గంలో విజయవంతంగా నడిపిస్తారని నమ్ముతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

సరిహద్దుల్లో సమస్యలను పరిష్కరించి...దేశాన్ని ప్రధాని మోదీ విజయపథంలో నడిపించగలరని సీఎం జగన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని జరిపిన అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. చైనాతో జరిగిన ఘర్షణలో మరణించిన 20 మంది వీరసైనికుల మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. వారి త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. అమరులైన సైనికుల కుటుంబాలకు అందరూ తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంక్షోభ సమయంలో ఏ వ్యుహాత్మక నిర్ణయం తీసుకున్నా దానిని తాము కట్టుబడి ఉంటామని మోదీకి జగన్ తెలిపారు.
ఇవీ చదవండి:దేశ రక్షణే తొలి ప్రాధాన్యం- సైన్యానికి పూర్తి స్వేచ్ఛ: మోదీ