రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపటంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ముఖ్య నేతలు, అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో పాటు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పాల్గొన్నారు. విచారణ సందర్భంగా కోర్టు వెల్లడించిన అభిప్రాయాలు, తీర్పుపై చర్చించారు.
పంచాయతీ ఎన్నికలపై సీఎం జగన్ కీలక నిర్ణయం
CM JAGAN
15:28 January 25
ఎస్ఈసీకి సహకరించాలని ఆదేశం
ఎన్నికల సంఘానికి సహకారం అందించాలా?... వద్దా?.. అనే అంశంపై అభిప్రాయాలు సేకరించారు. అనంతరం పంచాయతీ ఎన్నికల్లో ఎస్ఈసీకి సహకరించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి :
Last Updated : Jan 25, 2021, 7:10 PM IST