సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యమంత్రి మామ ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ గంగిరెడ్డి మరణించారు. వైఎస్ భారతి తండ్రి మృతితో ముఖ్యమంత్రి ఇంట విషాదం నెలకొంది. గంగిరెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలించారు. గంగిరెడ్డి అంత్యక్రియలు స్వగ్రామం వేముల మండలం గొల్లల గూడూరులో ఈరోజు జరగనున్నాయి. గంగిరెడ్డికి జగన్ నివాళులర్పించారు.
గంగిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ నివాళి - సీఎం జగన్ మామఈసీ గంగిరెడ్డి మృతి తాజా వార్తలు
ప్రముఖ వైద్యుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి కన్నుమూశారు. గంగిరెడ్డి జగన్ సతీమణి భారతి తండ్రి. అనారోగ్యంతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగిరెడ్డి ఈరోజు మృతి చెందారు.
CM Jagan
Last Updated : Oct 3, 2020, 2:29 PM IST