రేపు రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలంటూ ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపుమేరకు రాష్ట్ర ప్రజలు 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించాలని ట్వీట్ చేశారు. ప్రజల్లో స్ఫూర్తిని రగిలించేందుకు దీపాలు వెలిగించాలని తెలిపారు. కరోనాపై ఐకమత్యంగా, బలంగా పోరాడగలమనే నమ్మకాన్ని నింపాలని సూచించారు.
దీపాలు వెలిగించాలని సీఎం ట్వీట్.. స్పందించిన ప్రధాని
రేపు రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించాలంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కరోనాపై ఐకమత్యంగా, బలంగా పోరాడగలమనే నమ్మకాన్ని నింపాలని సూచించారు. ఈ ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించి ధన్యవాదాలు తెలిపారు.
దీపాలు వెలిగించాలని సీఎం ట్వీట్.. స్పందించిన ప్రధాని
సీఎం జగన్ పిలుపునకు ప్రధాని మోదీ స్పందించారు. సీఎం జగన్ ఇస్తున్న మద్దతు ఎంతో విలువైనదని మెచ్చుకున్నారు. మోదీ..సీఎం జగన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 192 కరోనా పాజిటివ్ కేసులు