తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి సీఎం జగన్ నివాళులర్పించారు. బాబా సాహెబ్ నవ భారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడని సీఎం అభివర్ణించారు. సర్వమానవత్వానికి కృషి చేసిన కారణ జన్ముడుగా, భారత సమాజానికి పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన మహోన్నతుడుగా కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిండుమనసుతో నివాళులు అర్పిస్తున్నట్టు సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులు మేకతోటి సుచరిత, పినిపే విశ్వరూప్, తానేటి వనిత.. బాబాసాహెబ్‌కు నివాళులు అర్పించారు.
ఇదీచూడండి: