ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడు రోజులు.. మూడు ప్రాంతాలు.. ముఖ్యమంత్రి పర్యటన

ఈనెల 17, 18, 19వ తేదీల్లో సీఎం జగన్ బిజీబిజీగా గడపనున్నారు. మూడు రోజుల్లో 3 ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

CM Jagan Tour in three places in next 3 days
CM Jagan Tour in three places in next 3 days

By

Published : Feb 13, 2021, 8:51 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి మూడు రోజుల్లో మూడు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈనెల 17వ తేదీన విశాఖలో పర్యటించనున్నారు. శారదాపీఠంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో హాజరు అయ్యేందుకు సీఎం జగన్ విశాఖ వెళ్లనున్నారు. 18వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు. బంగ్లాదేశ్ యుద్ధంలో విజయం సాధించినందుకు గుర్తుగా భారత సైన్యం నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదికి వెళ్లనున్న ముఖ్యమంత్రి... లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి నూతనంగా నిర్మించిన రథాన్ని సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details