సీఎం జగన్ నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన... అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు వెళ్లి రాత్రి బస చేస్తారు. 24వ తేదీ ఉదయం 9.10 గంటల నుంచి 9. 40 గంటల వరకూ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌లో ప్రార్థనలు చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పులివెందుల చేరుకుని.. నూతన ఆర్టీసీ బస్టాండు, బస్సు డిపో సహా ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
25వ తేదీ ఉదయం ఉదయం 9 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటల వరకూ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 11 గంటల 55 నిమిషాలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం జగన్ కడప పర్యటన సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని.... జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.