సీఎం జగన్ ఇవాళ ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. దీపావళి పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు ముఖ్యమంత్రి విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్తునట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. సీఎం వెంట ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వెళ్లనున్నట్లు తెలిసింది. గవర్నర్‌తో భేటీ సందర్భంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల కమిషనరు, న్యాయస్థానంలో కేసులు తదితర విషయాలపైనా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నేడు గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్లో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
cm jagan to meet governor