CM Jagan Prajadarbar: ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించేందుకుగాను త్వరలో ‘ప్రజాదర్బార్‘ను ముఖ్యమంత్రి జగన్ చేపట్టనున్నట్లు తెలిసింది. వారంలో ఐదు రోజులపాటు రోజూ ఉదయం ఆయన విన్నపాలు స్వీకరించనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆ భవన నిర్మాణ సమయంలోనే చేశారు.
ప్రభుత్వంలోకొచ్చిన తొలి ఏడాదిలోనే ప్రజాదర్బార్ చేపడతారని అప్పట్లో అనుకున్నారు, అయితే ఇప్పటివరకూ జరగలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రజాదర్బార్ చర్చ మొదలైంది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల నుంచి దీన్ని సీఎం చేపట్టే అవకాశం ఉందని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీనిపై కచ్చితమైన నిర్ణయమైతే ఇప్పటికీ జరగలేదని పేర్కొన్నాయి.