ఏదో వంక పెట్టుకుని కోర్టుకు ఎగ్గొట్టడం జగన్‌కి తగదని తెదేపా సీనియర్ నేత వర్లరామయ్య హితవు పలికారు. ఇలా వాయిదా వేయించుకుంటూ పోతే కేసు ఎప్పటికి పూర్తవ్వాలని ప్రశ్నించారు. జగన్ అవినీతిపరుడు కాకుంటే కేసు సత్వరమే పూర్తయ్యేలా ఎందుకు చొరవ చూపరని నిలదీశారు. రాజకీయ నాయకులపై ఉన్న ఆర్థిక కేసులు ఏడాదిలో పూర్తి కావాలనే నిబంధనను ప్రధాని కచ్చితంగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రతీ శుక్రవారం సీఎం జగన్ తన బాధ్యతలు ఇంకెవరికైనా ఇచ్చి కోర్టుకు వెళ్లాలని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
సీఎం జగన్ నిజాయితీపరుడైతే కోర్టుకు వెళ్లాలి: వర్ల
సీఎం జగన్ నిజాయితీపరుడైతే తనపై నమోదైన కేసుల విచారణను త్వరితగతిన పూర్తయ్యేలా సహకరించాలని వర్ల రామయ్య సూచించారు. కోర్టుకు హాజరుకాకుంటే కేసులు ఎప్పటికి తేలాలని ప్రశ్నించారు.
varla ramaiah