జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు. ఆదివారం ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలందిస్తున్నవారికి ఆదివారం సాయంత్రం 5 గంటలకు చప్పట్లు, గంటలు మోగిస్తూ మద్దతు పలకాలని కోరారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక అధికారులు సైరన్ మోగిస్తారని సీఎం చెప్పారు. ఆరోజు ప్రయాణాలు, పనులు రద్దు చేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిత్యావసర వస్తువులు, ఎమర్జెన్సీ సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
జనతా కర్ఫ్యూను పాటించండి: సీఎం జగన్ విజ్ఞప్తి - ఏపీలో జనతా కర్ఫ్యూ
కరోనాపై పోరులో భాగంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలపాలని... రాష్ట్ర ప్రజలను సీఎం జగన్ కోరారు. ఆదివారం రోజు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రయాణాలు, ఇతర పనులను రద్దు చేసుకోవాలని సూచించారు.
cm jagan