ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం బాహ్య ప్రపంచంలోకి రావాలి: వర్ల - తెదేపా నేత వర్ల రామయ్య వార్తలు

ముఖ్యమంత్రి జగన్ నాలుగు గోడల మధ్య బందీగా ఉండిపోయారని తెదేపా నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ఆయన బాహ్య ప్రపంచంలోకి వచ్చి ప్రజల్లో ధైర్యం నింపాలని సూచించారు. వైకాపా ఎమ్మెల్యేల తీరుతోనే కరోనా విజృంభించిందని ఆరోపించారు

varla
varla

By

Published : May 2, 2020, 7:24 PM IST

ముఖ్యమంత్రిపై తెదేపా నేత వర్ల రామయ్య విమర్శలు

కరోనా మహామ్మారి నుంచి ప్రజలను రక్షించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ అవగాహనలేమి, నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వైకాపా ఎమ్మెల్యేల తీరుతోనే కరోనా విజృంభించిందని ఆరోపించారు. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడితే ఏపీలో కేసులు ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు. గ్రీన్​జోన్​లోనైనా సీఎం పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపాలని డిమాండ్ చేశారు. సీఎం బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టకపోతే ప్రజలకు భరోసా కల్పించేదెవరని నిలదీశారు. స్థానిక ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా కట్టడిలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details