రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం కాకుండా... సొంత ప్రయోజనాల కోసం వైకాపా సర్కార్ పరిపాలన చేస్తోందని విమర్శించారు. గుంటూరు సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. హైకోర్టును తరలించినంత మాత్రాన కర్నూలులో అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి తప్ప... కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనడం సరైన పద్ధతి కాదన్నారు. జీఎన్‌రావు నివేదికపై... సీఎం జగన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలన్నారు. 30 రాజధానులు పెట్టుకుంటామన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను రామకృష్ణ తప్పుబట్టారు.
'సీఎం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి' - రాజధాని అమరావతి
రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. కక్ష సాధింపు కోసం రాష్ట్రాభివృద్ధిని ఫణంగా పెట్టొద్దని హితవు పలికారు. రాజధానిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి... అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
రామకృష్ణ