ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నిర్ణయాన్ని పార్టీ నేతలు ఎవరైనా వ్యతిరేకిస్తే సహించబోమని... ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎంతటివారైనా పార్టీ నుంచి బహిష్కరించేందుకూ వెనుకాడబోమని హెచ్చరించినట్లు సమాచారం. వైకాపా ముఖ్య నేతలతో మంగళవారం సాయంత్రం సీఎం నిర్వహించిన భేటీలో.... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారనే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో ఆయన్ను గట్టిగా మందలించాలని... ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్ఛార్జి వై.వి.సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలేనని, వారి జీవితాలు మారాలన్న మంచి ఆలోచనతో ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తున్నట్లు... ఈ సందర్భంగా సీఎం పునరుద్ఘాటించారు.
ఆంగ్ల మాధ్యమం నిర్ణయం వ్యతిరేకిస్తే పార్టీ బహిష్కరణకైనా సిద్ధం...!
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నిర్ణయాన్ని పార్టీ నేతలు ఎవరైనా వ్యతిరేకిస్తే సహించబోమని... ముఖ్యమంత్రి స్పష్టంచేసినట్లు తెలిసింది.
ఆంగ్ల మాధ్యమం నిర్ణయం వ్యతిరేకిస్తే పార్టీ బహిష్కరణకైనా సిద్ధం...!
TAGGED:
cm jagan serious on ycp mp