తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో దళిత యువకుడి శిరోముండనం ఘటనపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు చేసుకోరాదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన డీజీపీ... ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం తదుపరి చర్యలుంటాయని డీజీపీ తెలిపారు.
సీతానగరంలో యువకుడి శిరోముండనం ఘటనపై సీఎం ఆగ్రహం - తూర్పుగోదావరి ఘటనపై విచారణకు సీఎం ఆదేశం
తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేయడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.
సీఎం జగన్