పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న విద్యా కానుకలో 6 రకాల వస్తువులు ఉండాలని సూచించారు. మూడు జతల ఏకరూప దుస్తులు, నోట్ పుస్తకాలు, సాక్స్, బూట్లు, బెల్టు, బ్యాగు, పాఠ్య పుస్తకాలు కిట్‌లో ఉండాలని జగన్ సూచించారు. ఏకరూప దుస్తులు, బెల్టు, బ్యాగుల నమూనాలను అధికారులు సీఎంకు చూపించారు. పిల్లలకు ఇచ్చే వస్తువులు నాణ్యతతో ఉండాలని, పాఠశాలు తెరిచే నాటికి పంపిణీకి సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు. 'నాడు–నేడు' తొలివిడతలో భాగంగా 15 వేల 7 వందల 15 స్కూళ్లలో జరుగుతున్న పనులు.. జూన్ నాటికి పెండింగులో ఉండకూడదని సీఎం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై సమీక్షించిన జగన్.. డిజిటల్ బోధనకు ప్రతి పాఠశాలకూ స్మార్ట్ టీవీ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. గోరుముద్ద మధ్యాహ్న భోజనంపై యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గోరుముద్దకు సంబంధించి బిల్లులు పెండింగులో ఉండకూడదన్న సీఎం..... వచ్చే సమీక్షా సమావేశం నాటికి ఈ పనుల్లో ప్రగతి కనిపించాలని స్పష్టం చేశారు.
పాఠశాలలు తెరిచేనాటికి 'జగనన్న విద్యాకానుక '
పాఠశాల విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు ఇచ్చే వస్తువులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు ఇచ్చే 6 రకాల వస్తువులు నాణ్యతతో ఉండాలని సూచించారు. జూన్ నాటికి పెండింగులో ఉన్న పనులు పూర్తిచేయాలన్నారు.
cm