వైఎస్‌ఆర్ చేయూతలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం జగన్ తెలిపారు. వైఎస్‌ఆర్ చేయూత, వైఎస్‌ఆర్ ఆసరా అమలుపై సమీక్ష నిర్వహించిన ఆయన.... పథకం అమల్లో ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కోరుతున్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, ఎవరైనా లంచం అడిగినా, ఫిర్యాదు చేయాలి. ఫోన్ చేయాల్సిన నెంబర్ దుకాణం వద్ద ప్రదర్శించాలి. వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలి, లేకపోతే విశ్వాసం కోల్పోతాము. కొత్తగా ఏర్పాటవుతున్న షాపులకు ఒక బ్రాండింగ్ తీసుకురావాలి, వాటికి తగిన ప్రాచుర్యం కల్పించాలి.- సీఎం జగన్