రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి... సత్వరమే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ప్రధాన టెండర్లు తెరిచిన... మరుసటి రోజే రివర్స్ టెండర్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రధాన టెండర్లకు, రివర్స్ టెండర్‌కు మధ్య ఎక్కువ సమయం ఉండకూడదని స్పష్టం చేశారు. ఏపీ టిడ్కోపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
సీఎం జగన్ కీలక నిర్ణయం... ఇళ్ల నిర్మాణాల్లోనూ ఇక..! - latest news of CM jagan reviews
రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి... సత్వరమే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. సచివాలయంలో టిడ్కోపై సీఎం సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏపీ టిడ్కో పరిధిలో ఉన్న 65,969 ఫ్లాట్ల నిర్మాణంపై... రివర్స్ టెండరింగ్‌ను సీఎం సమీక్షించారు. ఇవన్నీకూడా బేస్‌మెంట్ లెవల్లో ఉన్నాయి. ప్రజాధనం ఆదా, పారదర్శక, అవినీతిరహిత విధానాల్లో వీటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండరింగ్‌కు వెళ్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. దీనికి మరుసటిరోజే రివర్స్‌టెండరింగ్‌ను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. గతంలో నిర్దేశించిన నిర్మాణ ప్రమాణాలను అలాగే ఉంచి... రివర్స్ టెండరింగ్ పిలవాలని సీఎం స్పష్టంచేశారు.
ఇదీ చదవండి : 'అలా జరగకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతా'