భూసేకరణలో సమస్య పరిష్కరానికి జిల్లాలకు సీఎస్, ముఖ్యమంత్రి కార్యదర్శులను నియమించారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలకు సీఎస్ నీలం సాహ్ని, సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను నియమించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, రాయలసీమ జిల్లాలకు సీఎం కార్యదర్శి ఆరోఖ్య రాజ్, ఉత్తరాంధ్ర జిల్లాలకు సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు అప్పగించారు.
కలెక్టర్లకు ఏ సాయం కావాల్సినా సంబంధిత అధికారులను సంప్రదించాలని స్పష్టం చేశారు. మార్చి 1 నాటికి ఇళ్లస్థలాల భూమిని పొజిషన్‌లోకి తీసుకునేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి వాలంటీర్‌కు 50 ఇళ్ల కేటాయింపుతో క్లస్టర్ మ్యాపింగ్ చేయాలన్న ముఖ్యమంత్రి... మార్చి 1 నాటికి అన్ని దిశ పోలీస్‌స్టేషన్లు సిద్ధం కావాలని చెప్పారు.