ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

30 నైపుణ్యాభివృద్ధి కళాశాలలు ఏర్పాటు చేయాలి: సీఎం - నైపుణ్యాభివృద్ధి కళాశాలలు న్యూస్

రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలల ఏర్పాటును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అధికారులను ఆదేశించారు. ప్రతి లోక్​సభ నియోజకవర్గంలో ఓ కళాశాల చొప్పున ఏర్పాటు చేయాలని సూచించారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కోర్సులు, శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు.

cm jagan review on skill development
cm jagan review on skill development

By

Published : Sep 1, 2020, 3:22 PM IST

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటు, వాటికి తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్‌ సెక్రటరీ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి ఒక కళాశాల ఉండేలా చూసుకోవాలన్నారు.

భవనాల నిర్మాణం నాణ్యంగా ఉండాలి

కాలేజీల కోసం ఇప్పటివరకూ దాదాపు 20 చోట్ల స్థలాల గుర్తించామని, మిగిలిన చోట్ల కూడా చురుగ్గా స్థలాల ఎంపిక ప్రక్రియ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవనాల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం సూచించారు. స్కిల్‌ డెవలప్​మెంట్‌ కాలేజీల్లో కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీపై ఆరాతీశారు.

4 అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం

పలు రకాల కోర్సులకు సంబంధించిన పాఠ్య ప్రణాళికను సిద్ధం చేశామని అధికారులు సీఎం జగన్​కు తెలిపారు. పరిశ్రమల అవసరాలపై సర్వే, ఆ సర్వే ప్రకారం కోర్సులను నిర్ణయించామని వివరించారు. ఫినిషింగ్‌ స్కిల్ ‌కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు.. ఇలా రెండు రకాలుగా స్కిల్‌ కాలేజీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొత్తం 162కి పైగా కోర్సుల ద్వారా ఈ కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. పాఠ్య ప్రణాళిక తయారీలో 4 అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యం తీసుకున్నామన్నారు. మరో 23 ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యం, వారితో ఎంఓయూలకు సిద్ధమయ్యామని, మరో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయని వివరించారు.

పనులు త్వరగా మెుదలుపెట్టాలి

ల్యాబ్‌ ఏర్పాట్లు, పాఠ్యప్రణాళికలో వీరి సహకారం తీసుకుంటున్నామని అధికారులు జగన్​ దృష్టికి తీసుకెళ్లారు. ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బయోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్‌ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయన్నారు. వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపైనా శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆర్థికశాఖ అధికారులతో కూర్చుని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులు త్వరగా మొదలుపెట్టాలని సీఎం నిర్దేశించారు.

ఇదీ చదవండి:

ఇవాళ కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్

ABOUT THE AUTHOR

...view details