జనవరి 20లోపు అన్ని జిల్లాలోనూ..
జనవరి ఏడో తేదీ నుంచి ఉభయగోదావరి, కడప, జనవరి 20లోపు అన్ని జిల్లాల్లోనూ ఈ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఏర్పాటవుతున్న చెక్ పోస్టులపైనా ఆయన ఆరా తీశారు. వచ్చే నెల 20లోపు చెక్‌పోస్టుల ఏర్పాటు, సీసీ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్... ఇసుక డోర్ డెలివరీ ప్రారంభం కావాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే 349 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. మిగిలినవి వీలైనంత త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఇసుక సరఫరా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటుపై సీఎం ఆరా తీశారు. ఇసుక సరఫరా చేసే 9వేల వాహనాలకు జీపీఎస్ అమర్చామని అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 80 వేల మెట్రిక్ టన్నుల ఇసుక వెలికి తీస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 155 స్టాక్ యార్డుల్లో 13 చోట్ల ఇసుక త్వరగా అయిపోతోందని... అందుకే డోర్ డెలివరీ విధానాన్ని తీసుకోస్తున్నామన్నారు. ప్రభుత్వం తర్వాత రవాణా ఛార్జీలు చెల్లించేలా ఈ విధానం ఉంటుందని తెలిపారు.