మద్యం, ఇసుకలో అక్రమాలకు ఆస్కారం ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అక్రమ రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టేవారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవస్థీకృతంగా అవినీతికి ఆస్కారం ఉండకూడదన్నారు.
'మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి' - cm jagan on illegal sand transport at ap
మద్యం, ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టేవారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఎస్‌ఈబీకి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

తప్పులు జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఉద్ధృతంగా దాడులు చేయాలని.. సరిహద్దు రాష్ట్రాల నుంచి తరలించే మద్యంపై దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు. సమర్థత, నిజాయితీ అధికారులకు ఎస్‌ఈబీలో స్థానం కల్పించాలన్నారు. వచ్చే 15 రోజుల్లో మెరుగైన ఫలితాలు రావాలన్నారు. ప్రతివారం సమావేశమై సమీక్ష చేయాలని.. ఎస్‌ఈబీకి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఉత్తమ పనితీరు కనబర్చినవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఇద చదవండి: రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి: జీకే ద్వివేది