ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 18, 2020, 10:58 PM IST

ETV Bharat / city

పెళ్లిళ్లకు 50 మందే..రెస్టారెంట్ల వద్ద టేక్ అవే

నాలుగో విడత లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల మేరకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేగాకుండా... కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకుంది.

cm-jagan-review-on-rtc-bus-services
cm-jagan-review-on-rtc-bus-services

కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి కరోనా నివారణ కోసం తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై సీఎం జగన్​ చర్చించారు. ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారించాలని సీఎం ఆదేశించారు. ప్రతి దుకాణంలో గరిష్టంగా ఐదుగురిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. పెళ్లిళ్లులాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతిస్తారు. రెస్టారెంట్ల వద్ద టేక్‌ అవేకు అనుమతిస్తారు. టేక్‌ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అన్ని దుకాణాలను ఉదయం 7 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ తెరుచుకునేందుకు అనుమతించారు.

కరోనా పట్ల భయాందోళనలు పోయేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు తమకు తాము స్వచ్చందంగా ఆరోగ్య పరిస్థితులను తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వార్డు, క్లినిక్స్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని..వచ్చే మార్చి నాటికి ఇవి పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా చూడాలని సమావేశంలో నిర్ణయించారు. వలస కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పని చేశారని సీఎం ప్రశంసించారు. మానవత్వంతో వ్యవహరించి రాష్ట్రం గుండా నడిచివెళ్తున్నవారికి సహాయంగా నిలిచారని అన్నారు.

ఇదీ చదవండి: 'తెలంగాణ విభజన చట్టాన్ని అతిక్రమిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details