CM Jagan review on Roads: రాష్ట్రంలోని రహదారులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రోడ్ల మరమ్మతులకు ప్రణాళికబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. ఎక్కడా గుంతల్లేని విధంగా రోడ్లు వేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయ ప్రగతి కనిపించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ రోడ్లను బాగుచేయడం కోసం దాదాపుగా రూ.2500 కోట్లు ఖర్చు పెడుతోందని వెల్లడించారు. పీఆర్ రోడ్ల కోసం సుమారు రూ.1072.92 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు వివరించారు. ప్రతి జిల్లాలో గతంలో ఎంత ఖర్చుచేశారు? ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం? అనేదానిపై వివరాలను ప్రజల ముందు ఉంచాలని తెలిపారు. ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్లు ఇలా అన్ని విషయాల్లో గతంలో ఎంత? ఇప్పుడు ఎంత ఖర్చు చేశామో ప్రజల ముందు వివరాలు ఉంచాలన్నారు.
గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి? బాగుచేసిన తర్వాత ఎలా ఉన్నాయి.. నాడు – నేడు పేరుతో ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. బ్రిడ్జిలు పూర్తై అప్రోచ్ రోడ్లు లేనివి, పెండింగ్ బ్రిడ్జిలు, ఆర్వోబీలు.. వీటన్నింటినీ పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. యుద్ధ ప్రాతిపదికిన వీటిపై దృష్టి పెట్టి.. వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత పాటించాల్సిందేనని తెలిపారు. నిర్దేశించిన ప్రమాణాలు ప్రకారం రోడ్లు వేయాలన్నారు. ఉమ్మడి వైయస్సార్ జిల్లా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న బ్రిడ్జిలు, కల్వర్టులు శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
"రోడ్ల మరమ్మతులకు ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నాం.ఎక్కడా గుంతల్లేని విధంగా రోడ్లు వేస్తున్నాం.ప్రభుత్వంపై వచ్చే విమర్శలను ఛాలెంజ్‌గా తీసుకోవాలి.రోడ్ల విషయంలో ఏడాదిలోగా గణనీయ ప్రగతి కనిపించాలి.ఆర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం.పీఆర్ రోడ్ల బాగు కోసం రూ.1,073 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్లు పూర్తయ్యాక నాడు-నేడు పేరుతో ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయండి. పెండింగ్ వంతెనలు, ఆర్‌వోబీలు పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టాలి. నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం రోడ్లు వేయాలి. "- ముఖ్యమంత్రి జగన్
వర్షాకాలంలోపు మరమ్మతులు పూర్తి :వర్షాకాలంలోపు ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని, ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ‘రాష్ట్రంలో 7,804 కిలోమీటర్ల పొడవున ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నాం. 1,168 పనుల్లో రూ.947 కోట్ల విలువైన 522 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.900 కోట్ల బిల్లులు చెల్లించాం. నిడా మొదటి విడత కింద 233 రోడ్లు, వంతెనల పనులకు రూ.2,479 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రూ.2వేల కోట్లు వ్యయం చేశాం. ఆగస్టు నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రెండో విడత కింద 33 ఆర్వోబీ పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. డిసెంబరు నుంచి పనులు ప్రారంభిస్తాం. కొత్తగా 38 ఆర్వోబీల పూర్తికి రూ.2,661 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎన్‌డీబీ మొదటి విడత పనులు మే నెలాఖరుకు, రెండో విడత పనులను డిసెంబరులో ప్రారంభిస్తాం. ఇందులో భాగంగా మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చే రోడ్లను 2 లేన్లుగా విస్తరిస్తున్నాం. రాష్ట్రంలో 7 జాతీయ రహదారుల నిర్మాణానికి డీపీఆర్‌లను సిద్ధం చేశాం. వీటికి ఏడాదిలోగా భూసేకరణ పూర్తవుతుంది’ అని అధికారులు వివరించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :