ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇసుక కొరత తాత్కాలికమే..త్వరలోనే సమస్య తీరుతుంది' - latest news of cm jagan review

ఇసుక కొరత తాత్కాలికమేనని ముఖ్యమంత్రి జగన్​ అన్నారు. నవంబర్​ నెలాఖరు నాటికి సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని తెలిపారు. రహదారుల, భవనాల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితికి ఊహించని రీతిలో వస్తోన్న వరదే కారణమని అభిప్రాయపడ్డారు.

CM Jagan Review on Roads and Buildings Department

By

Published : Nov 4, 2019, 12:25 PM IST

Updated : Nov 4, 2019, 3:08 PM IST


రాష్ట్రంలోని నదుల్లో వరద ఊహించని రీతిలో వస్తున్నందునే ఇసుక కొరత ఏర్పడిందని ముఖ్యమంత్రి జగన్​ అన్నారు. రహదారులు, భవనాల శాఖపై సమీక్షించిన ఆయన.. ఇసుక కొరత తాత్కాలికమేనని.. నవంబర్​ నెలాఖరునాటికి సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 265కి పైగా రీచ్​ల్లో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని మిగతా రీచ్​లన్నీ వరద నీటిలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇసుక తీయడం కష్టంగా ఉందని... లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. నీళ్లు రావడం పంటలకు, భూగర్భ జలాలకు మంచిదే కానీ... నిరంతర వరద వల్ల ఇసుక సమస్య ఏర్పడిందని అన్నారు.

అవినీతికి ఆస్కారం లేదు

గత ఐదేళ్లుగా ఇసుక మాఫియా నడిచిందన్న సీఎం... పొక్లెయిన్లు, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మాన్యువల్​గా చేస్తున్నామని అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. నూతన పాలసీని పేదలకు మేలు చేసేలా రూపొందించామని వెల్లడించారు. ప్రాధాన్యత రంగాలకు ఇసుక ఇచ్చేందుకు ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Last Updated : Nov 4, 2019, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details