ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆదాయం ఆశాజనకం.. సీఎంకు వివరించిన అధికారులు - CM JAGAN REVIEW

CM JAGAN REVIEW : దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో జీఎస్టీ సగటు వసూళ్లు అధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్​కు అధికారులు వివరించారు. ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.

CM JAGAN REVIEW
CM JAGAN REVIEW

By

Published : Oct 6, 2022, 4:53 PM IST

CM REVIEW : రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. 94.47శాతం లక్ష్యం చేరుకున్నట్టు వెల్లడించారు. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ వసూళ్లు ఉన్నాయన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.

పారదర్శక, సులభతర విధానాల ద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని సీఎం ఏర్పాటు చేశారు. నాటు సారా తయారీయే వృత్తిగా ఉన్నవారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్‌ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వారికేమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణాశాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలన్నారు.


ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details