భారీవర్షాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్షించారు. తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. రిజయర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహారం, మందులు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు.
CM Review: భారీ వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష - జిల్లా కలెక్టర్లతో జగన్ సమీక్ష
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
![CM Review: భారీ వర్షాలపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష cm jagan review on rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13666049-1050-13666049-1637213660722.jpg)
cm jagan review on rains