ప్రాథమిక అభ్యాసం(ప్రీ స్కూల్)పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం జగన్ తెలిపారు. ఆంగన్వాడీల అభివృద్ధికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న ఆయన... ఇకపై వైఎస్‌ఆర్ ప్రీప్రైమరీ స్కూళ్లుగా అంగన్వాడీలను మార్పు చేస్తున్నామని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త పాఠ్య ప్రణాళిక అమలవుతుందని... ప్రీప్రైమరీకి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ప్రత్యేక పాఠ్య ప్రణాళిక తయారీ బాధ్యత విద్యాశాఖకు అప్పగించామని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. అంగన్వాడీ టీచర్లకు కొత్తగా డిప్లమో కోర్సు ప్రారంభిస్తాం. బోధన పద్ధతులు, పాఠ్య ప్రణాళికపై శిక్షణ ప్రభుత్వం ఇస్తుంది. సులభమైన మార్గాల్లో పిల్లలకు విద్యాబోధనపై శిక్షణ అందాలి. అంగన్వాడీల్లో పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతాం- సీఎం జగన్