ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 8, 2020, 3:45 PM IST

Updated : Jan 8, 2020, 4:24 PM IST

ETV Bharat / city

'ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే పింఛన్లు'

రాష్ట్రంలో కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్​ అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని నిర్దేశించారు. సచివాలయంలో పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధిపై సమీక్షించిన ఆయన.. వాలంటీర్ల ద్వారా ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

cm jagan
సీఎం జగన్

రాష్ట్రంలో కొత్తగా మరో 300 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 15,971 ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్​ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఉపాధిహామీ పనులు, గ్రామ సచివాలయాల అంశాలపై అధికారులతో చర్చించిన సీఎం... రైతు భరోసా కేంద్రాలు, నాడు - నేడు కింద స్కూళ్లలో ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టడంపై ఆరా తీశారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు.

ఫిబ్రవరి నుంచి పింఛన్​ ఇంటికే

ఉపాధి హామీ నిధులతో స్కూళ్లకు ప్రహరీగోడలు నిర్మించాలని అధికారులకు సీఎం సూచించారు. ఫిబ్రవరి నుంచి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సర్వేలతో ముడిపెట్టి పేదలకు ఇళ్లపట్టాలు నిరాకరించవద్దని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అర్హులైన వ్యక్తులు ఎంతమంది ఉన్నా పట్టాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Last Updated : Jan 8, 2020, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details