పారిశ్రామిక ప్రమాదాల నివారణపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొత్తగా ఇండస్ట్రియల్ సేఫ్టీ పాలసీ తీసుకురావాలని సీఎం వద్ద అధికారులు ప్రతిపాదించారు. ఈమేరకు ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ ఈ సేఫ్టీ పాలసీ పరిధిలోకి తీసుకురావటంతో పాటు ఇండస్ట్రీయల్ అట్లాస్ రూపొందించాలని నిర్ణయించారు.
పరిశ్రమల కాంప్లియన్స్ నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎలాంటి చర్యలు తీసుకున్నామనే అంశాన్ని కంపెనీలు బోర్డులపై పెట్టాలన్న ఆయన... థర్డ్‌పార్టీ తనిఖీలు కూడా ఉండాలని స్పష్టం చేశారు. ఇండస్ట్రీయల్ పార్కుల్లోనూ నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలని దిశానిర్దేశం చేశారు.