ఎంఎస్‌ఎంఈలపై కలెక్టర్లంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. కచ్చితంగా ఎంఎస్‌ఎంఈల సమస్యలు పరిష్కరించాలని.. లాక్‌డౌన్ సమయంలో ఈ రంగం పూర్తిగా కుదేలైన పరిస్థితి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈల.. గత రెండు నెలల విద్యుత్ బకాయిలు రద్దు చేస్తున్నామన్న ఆయన..పరిశ్రమల్లో కార్మికుల కొరత తీర్చేందుకు.. స్థానికులకి నైపుణ్య శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు.
ప్రతి పరిశ్రమకు తక్కువ వడ్డీకే రుణాలు: సీఎం - ఏపీలో ఎంఎస్ఎంఈ తాజా వార్తలు
ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉపాధి ఇచ్చేది ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లేనని సీఎం జగన్ అన్నారు. ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోకపోతే నిరుద్యోగం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎంఎస్ఎంఈలకు గత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల్లో సగాన్ని ఇవాళ ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. మిగిలిన మొత్తం వచ్చేనెల చివరికి చెల్లిస్తామన్నారు.
గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి చెల్లించలేదన్న సీఎం.. 2016-17లో రూ.195 కోట్లు, 2017-18లో రూ.207 కోట్లు, 2018-19లో రూ.313 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహం చెల్లించలేదని తెలిపారు. మొత్తం రూ.828 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందన్నారు. గత ప్రభుత్వ బకాయిలన్నీ ఇచ్చేందుకు ముందుకెళ్తున్నామని.. వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తక్కువ వడ్డీకి ఇప్పించేలా రూ.200 కోట్లు కార్పస్ నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పరిశ్రమకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్న జగన్.. రుణాలపై ఆరు నెలల పాటు మారటోరియం ఉంటుందన్నారు. ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహానికి మానవతా దృక్పథంతో అడుగులు ముందుకు వేయాలని కోరారు.
ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్ ప్రకటనలో కీలక అంశాలు ఇవే..