జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వేపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. భూరక్ష పథకం చురుగ్గా ముందుకు సాగాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కొవిడ్ పరిస్థితుల కారణంగా మందగమనంలో ఉందని.. లక్ష్యాలను అనుకున్న సమయంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలని.. అధికారులు సమన్వయంతో ముందుకుసాగాలన్నారు.
మారుమూల ప్రాంతాల్లో సర్వేకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం అన్నారు. అన్ని సేవలందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారుకావాలన్నారు. అన్నిరకాల శిక్షణలకు సంబంధించి ఈ - ఫార్మాట్‌లో ఉంచాలన్నారు. ఒక డిజిటల్ లైబ్రరీని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, భూపరిపాలన చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.