విద్యారంగంలో నాడు-నేడు చాలా కీలకమైన కార్యక్రమం అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు(cm jagan review on infrastructure development news). అలాంటి 'నాడు-నేడు'' కార్యక్రమం సమర్థంగా ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులపై సమీక్షించిన జగన్.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నైపుణ్యాభివృద్ధి కళాశాలల పనులు మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సూచించారు.
CM Jagan: రహదారుల పనులపై మరింత ధ్యాస పెట్టండి.. సీఎం జగన్ ఆదేశాలు - cm jagan
రహదారుల పనులపై మరింత ధ్యాస పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల(cm jagan review on infrastructure development news)పై సమీక్షించిన సీఎం.. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై ముఖ్యమంత్రి సమీక్షించారు(cm jagan review on roads news ). మే చివరి నాటికి రోడ్ల నిర్మాణం పూర్తవుతుందని అధికారులు తెలపగా.. పనులపై మరింత ధ్యాస పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టాలన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:Badvel Bypoll Result: బద్వేలు ఉప ఎన్నికలో ఫ్యాన్ జోరు.. మెజార్టీ ఎంతంటే..