ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష ముగిసింది. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార వ్యవస్థ అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
'సచివాలయాల్లో బలమైన సమాచార వ్యవస్థ ఉండాలి'
సమాచార శాఖపై సమీక్షించిన సీఎం... పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటైన సచివాలయాల వ్యవస్థకు బలమైన సమాచార వ్యవస్థ అందించాలని ఆదేశించారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రేషన్, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు చెల్లింపు కార్డులన్నీ సచివాలయాలే ఇస్తాయన్న సీఎం... కార్డులు లబ్ధిదారులకు అందాలంటే వ్యవస్థ సక్రమంగా ఉండాలన్నారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుపై ఆలోచించాలని అధికారులకు సూచించారు. ఒక్కో సిటీ 10 చదరపు కిలో మీటర్ల పరిధిలో ఏర్పాటుపై ప్రణాళికలు రచించాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టామని.... రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు ప్రోత్సాహక ధరలతో భూమి, నీరు, కరెంటు ఇస్తామని చెప్పారు.
ఇదీ చదవండి :ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు