నూతన జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా "ఉన్నత విద్యారంగంలో నూతన విద్యా విధానం" అమలుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. జాతీయ విద్యా విధానంలో ప్రస్తావించిన అంశాలు, అమలు చేయాల్సిన విధానంపై చర్చించారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలలు వచ్చే మూడేళ్లలో నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ), నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్- (న్యాక్) సర్టిఫికెట్లు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కాలేజీలు కూడా తప్పనిసరిగా ఎన్బీఏ, న్యాక్ గుర్తింపు పొందాలన్నారు. ప్రమాణాలు లేని అన్ని కాలేజీలకు నోటీసులు జారీ చేయాలని, మూడేళ్లలో మార్పు రాకపోతే చర్యలు తప్పవనే విషయం స్పష్టం చేయాలని నిర్దేశించారు. ప్రమాణాలు పాటించని ఇంటర్మీడియట్ కళాశాలలపై కొరడా ఝుళిపించాలన్నారు. బీఈడీ కళాశాలల్లో టీచర్ ట్రెయినింగ్ పరంగా నాణ్యత లేకుంటే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కళాశాలల్లో ప్రమాణాలు, నాణ్యతతో కూడిన బోధనకు సంబంధించి ఒక ఎస్వోపీ ఖరారు చేసుకోవాలని సూచించారు. బృందానికి ముగ్గురు చొప్పున 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి కళాశాలల్లో నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. విద్యాసంస్థల్లో ప్రమాణాలపై ఇప్పటికే దృష్టి సారించామని, 200కు పైగా కళాశాలకు నోటీసులు ఇచ్చామని అధికారులు సీఎంకు నివేదించారు.
నాలుగేళ్ల డిగ్రీ నుంచి నేరుగా పీహెచ్డీ