ఉన్నత విద్యా వ్యవస్థలో నాణ్యతకు పెద్దపీట వేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన సీఎం.. మంచి చదువులు ఇటు పిల్లలకు, అటు ప్రభుత్వానికి కూడా భారం కాకూడదని వ్యాఖ్యానించారు. కాలేజీల ఫీజులపై ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. మనం రూపొందించుకునే విధానాలు... దీర్ఘకాలం అమలు కావాలని సీఎం తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్న జగన్.. మార్చి 30న చెల్లింపులు చేసేలా ముందడుగు వేస్తున్నామన్నారు. ప్రతి విద్యాసంవత్సరంలో త్రైమాసికం పూర్తికాగానే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎం జగన్ - ఫీజు రియింబర్స్‌మెంట్‌పై జగన్ న్యూస్
ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పటికప్పుడు చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. గతేడాది బకాయిలతోపాటు ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించి.. చెల్లించడానికి సిద్ధమని తెలిపారు.
cm jagan review on higher education