Purchase of grain in AP: నవంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతులకు మద్దతు ధర వచ్చేలా అన్ని రకాలు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ మద్దతు ధర రాలేదని ఎక్కడనుంచి ఫిర్యాదు రాకూడదన్నారు.
CM Review: నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు: సీఎం జగన్ - CM Jagan review on grain collection
CM review on grain collection: ధాన్యం సేకరణ, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పౌరసరఫరాలశాఖలతో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మద్దతు ధర వచ్చేలా అన్ని రకాలు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వరి సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపైనా దృష్టి పెట్టాలన్నారు. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలపైనా దృష్టి పెట్టాలన్నారు.
ఇథనాల్ తయారీ:రాష్ట్రంలో విస్తారంగా వరి సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపైనా దృష్టి పెట్టాలన్నారు. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేయడం పైనా దృష్టి పెట్టాలన్నారు. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ నుంచి ఇథనాల్ తయారీపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. గన్నీబ్యాగులు, కూలీలు, రవాణా, అవసరమైన మేరకు ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలన్నారు.
ఇ–క్రాపింగ్: ఇ–క్రాపింగ్ తీరుపైనా సీఎం ఆరా తీశారు. ఈనెల 15వ తేదీలోగా డిజిటల్, ఫిజికల్ రశీదులివ్వాలని సీఎం ఆదేశించారు. పొగాకు రైతులకు నష్టం రాకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలని చెప్పారు. దీనివల్ల ధరలు పతనం కాకుండా రైతులకు మేలు జరుగుతుందన్నారు. అక్టోబరు 17న ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత అందించనున్నట్లు సీఎం తెలిపారు.
ఇవీ చదవండి: