ఉగాదికి పేదలకు ఇవ్వనున్న ఇళ్ల పట్టాలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో... ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి గృహనిర్మాణ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్థల సేకరణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వంటి అంశాలపై చర్చించారు. వారంలోగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. లబ్ధిదారులకు స్థలాల మార్కింగ్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలని సూచించారు. పట్టాపత్రాన్ని సెక్యూరిటీ ఫీచర్స్తో రూపొందించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22.46 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
'వారంలోగా ఇళ్ల స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయండి' - సీఎం జగన్ సమీక్ష వార్తలు
ఉగాదికి పేదలకు ఇవ్వనున్న ఉచిత ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వారంలోగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
cm-jagan-review-on-free-house-pattas-distribution