భారీ వర్షాలు, వరదలు, పంట, ఆస్తి నష్టంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదలపై మాట్లాడారు. పంటనష్టం, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపాలని అధికారులను ఆదేశించారు.
ఆర్‌బీకే స్థాయిలో రైతుల ఎన్యుమరేషన్ ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం ఉందన్న సీఎం జగన్... మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.