ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏలూరు ఘటనపై పూర్తి స్థాయిలో పరిశోధించండి: సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్షించారు. ప్రజల అస్వస్థతకు గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశోధించాలని అధికారులను ఆదేశించారు. సీసం లాంటి మూలకాలు ఎలా చేరాయి అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సూచించారు.

cm jagan review on eluru incident
cm jagan review on eluru incident

By

Published : Dec 8, 2020, 3:10 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజల అస్వస్థతకు గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశోధించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఏలూరు ప్రాంత ప్రజల శరీరాల్లోకి సీసం వంటి మూలకాలు ఎలా చేరాయో పరిశీలించాలన్నారు. వీటిపై ప్రజారోగ్య సిబ్బంది, తదితర విభాగాలు నిశితంగా పరిశీలన చేయాలని సూచించారు. అస్వస్థతకు దారితీసిన కారణాలు, మార్గాలను గుర్తించాలని ఆదేశించారు.

ప్రాథమిక నివేదిక ఇవ్వండి...

ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి చేస్తున్న వైద్య పరీక్షలు, అందుతున్న వైద్య సదుపాయాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. అస్వస్థతకు గురైన వారికి ఎయిమ్స్‌ వైద్య నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల్లో సీసం, నికెల్‌ లాంటి మూలకాలు ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. ఐఐసీటీ కూడా పరీక్షలు చేస్తోందని ఆ వివరాలు త్వరలోనే వస్తాయని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రేపు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ కు ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి

బాధితుల రక్త నమూనాల్లో సీసం గుర్తింపు..: ఏలూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్

ABOUT THE AUTHOR

...view details