ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కేసులు తగ్గుతున్నాయ్​.. కొన్ని జిల్లాల్లో ఇంకా మెరుగుపడాలి' - ఏపీలో కరోనా కేసులపై సీఎం జగన్​ సమీక్ష

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుమఖం పడుతున్నాయని సీఎం జగన్​ అన్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా నియంత్రణపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Cm Jagan review on covid situation in Andhrapradesh
Cm Jagan review on covid situation in Andhrapradesh

By

Published : May 26, 2021, 2:28 PM IST

కొవిడ్​పై పోరాటంలో భాగమైన సిబ్బందిని ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్నాయని.. సానుకూల పరిస్థితి ఏర్పడుతోందని సీఎం చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి.. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

"తరచుగా తప్పులు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. మొదటిసారి తప్పు చేస్తే జరిమానా... మళ్లీ చేస్తే కేసులు పెట్టాలి. 104కు ఎవరైనా ఫోన్‌ చేస్తే సరైన సమాధానం ఇవ్వాలి. సరిగ్గా స్పందించకుంటే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత కచ్చితంగా కర్ఫ్యూ పాటించాలి. 45 ఏళ్లు పైబడిన వారికి పూర్తయ్యాక మిగిలిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. మొదటి డోస్‌ వేసుకుని రెండో డోస్‌ కోసం వేచిచూస్తున్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లపై నియంత్రణతో కొరత లేకుండా ఇవ్వగలుగుతున్నాం" - వైఎస్ జగన్, ముఖ్యమంత్రి

ABOUT THE AUTHOR

...view details