కేసుల తీవ్రత అధికంగా ఉన్న నంద్యాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సూక్ష్మస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన సంచార ల్యాబ్.. శిబిరాల్లో ఉన్న వలస కూలీలను పరీక్షించడానికి ఉపయోగకరమన్నారు. రైతు బజార్లను వీలైనంత ఎక్కువగా వికేంద్రీకరించాలని సీఎం సూచించారు. డయాలసిస్ లాంటి చికిత్సలు అవసరమైన వారికి ఆసుపత్రుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. టమాటా, ఉల్లి, చీనీ సహా అన్ని ఉత్పత్తులకూ మార్కెటింగ్, ధరలపై దృష్టిపెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రతీ కుటుంబంలో ఒకరికి పాస్ ఇవ్వండి: సీఎం జగన్ - CM Jagan on covid control
కంటెయిన్‌మెంట్ జోన్లలో నిత్యావసరాలు తెచ్చుకోవడానికి కుటుంబంలో ఒకరికి పాస్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిత్యావసరాల దుకాణాలు వీధి చివర్లో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సీఎం జగన్ సమీక్ష