ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భయం వద్దు... ప్రజల్లో ధైర్యం నింపండి: సీఎం జగన్ - latest updates of carona

కరోనా నిరోధక చర్యలపై సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో ధైర్యం నింపాలని సూచించారు. వివాహాది శుభకార్యాలను వీలైనంత తక్కువ మందిలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

cm-jagan-review-on-corons
cm-jagan-review-on-corons

By

Published : Mar 19, 2020, 7:19 PM IST

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష

రాష్ట్రంలో కరోనా నిరోధక చర్యలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న కారణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు...

థియేటర్లు, మాల్స్, వ్యాయామశాలలు మూసివేయాలి.

చిన్న ఆలయాలు, మసీదులు, చర్చిలకు వెళ్లడం మానుకోవాలి.

భారీగా గుమిగూడే జాతరలు నిర్వహించకూడదు.

హోటళ్లు, రెస్టారెంట్లలో కనీసం 2 మీటర్ల దూరంలో ఉండేలా చూడాలి.

వివాహాది శుభకార్యాలను వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలి.

బహిరంగ ప్రదేశాల్లో పెద్దసంఖ్యలో ప్రజలు గుమికూడవద్దు.

ప్రజారవాణా వాహనాల్లో నిరంతర శుభ్రత పాటించాలి.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

అంతకుముందు ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ అన్ని రాష్ట్రాల సీఎస్​లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన చర్యలపై సీఎస్ నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్​లో వివరించారు. రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి :

డీజీపీతో సీఎం జగన్ రెండు సార్లు భేటీ: ఆ లేఖే కారణమా..?

ABOUT THE AUTHOR

...view details