ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతీ వలస కూలీకి దారి ఖర్చుకు రూ.500 సాయం: సీఎం జగన్

వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ వలస కూలీలను రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాల కూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి ఏపీకి లక్షన్నర మంది వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి, స్వస్థలాలకు పంపిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

By

Published : May 6, 2020, 7:28 PM IST

సీఎం జగన్
సీఎం జగన్

కరోనా నివారణ, సహాయ చర్యలపై సీఎం జగన్‌ సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏపీ వలసకూలీల తరలింపుపై సీఎం చర్చించారు. విదేశాలు, పలు రాష్ట్రాల నుంచి లక్షన్నర మంది వచ్చే అవకాశముందని అధికారులు సీఎంకు తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారంతా విశాఖ, విజయవాడ, తిరుపతి వస్తారన్న అధికారులు.. వచ్చిన వారందరికీ అక్కడే వైద్యపరీక్షలు చేయిస్తామని తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం క్వారంటైన్‌ చేసి పర్యవేక్షిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ తర్వాతే వారిని స్వస్థలాలకు పంపిస్తామని చెప్పారు.

వలస కూలీల విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఇక్కడున్న ఇతర రాష్ట్రాల కూలీలకు ఆహారం, వసతి కల్పించాలన్నారు. వివిధ పరిశ్రమల్లో పనులకు వెళ్తామనే వారికి సహకరించాలన్నారు. తమ రాష్ట్రాలకు వెళ్తామనే వారికి ప్రయాణ ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు.

ఒక్కో కూలీకి దారి ఖర్చులకు రూ.500 ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని ఏపీ కూలీలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంటలు సేకరించి రైతులకు అండగా నిలవాలన్న సీఎం.. రైతులు ఎక్కడ సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే స్పందించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి :నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరచిన వ్యాపారులు

ABOUT THE AUTHOR

...view details