కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. కరోనా నివారణ అధ్యయన వివరాలను ప్రభుత్వ సలహాదారు శ్రీనాథ్‌రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. కరోనా విస్తరణ స్థితిగతులు, నివారణ చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. ఉదయం 9 వరకు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదన్న అధికారులు.. దిల్లీ వెళ్లినవారు, వారిని కలిసినవారి వల్లే కేసులు పెరిగాయని ముఖ్యమంత్రికి వివరించారు. వీరికి చేసే పరీక్షలు పూర్తవుతున్న కొద్దీ కేసుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు.
- మూడోసారి సమగ్ర కుటుంబ సర్వే జరగాలి: జగన్
రాష్ట్రంలో మూడోసారి సమగ్ర కుటుంబసర్వే జరగాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై సర్వేచేసి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. రియల్‌టైం పద్ధతిలో ఎప్పటికప్పుడు సమాచారం నమోదు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అందరికీ పరీక్షలు చేయాలని సీఎం సూచించారు. పొరపాట్లు జరిగేందుకు అవకాశం లేకుండా ప్రక్రియ కొనసాగాలన్నారు.
- ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుపై సమగ్ర నివేదిక ఇవ్వాలి: జగన్