కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షించిన సీఎం జగన్... ఈ జిల్లాల్లో మరిన్ని పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. రెడ్, ఆరెంజ్ జోన్లతో తొలుత మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఆ నాలుగు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టిండి: సీఎం జగన్ - Jagan latest news
కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పెంచి రైతులకు అండగా నిలబడాలని సూచించారు.
నిన్న ఒక్కరోజే 5,022 కరోనా పరీక్షలు చేశామని సీఎంకు అధికారులు వివరించారు. 225 ట్రూనాట్ కిట్స్‌తో విస్తారంగా పరీక్షలు అందుబాటులోకి వచ్చాయన్న అధికారులు... సర్వేలో గుర్తించిన 32 వేలమందిలో 2 వేలకుపైగా పరీక్షలు చేశామని ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పారు. ప్లాస్మా థెరఫీ ప్రారంభించేందుకు అనుమతి కోరినట్టు వివరించారు. పంటల సంబంధిత సమస్యలు వస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పెంచి రైతులకు అండగా నిలబడాలని సూచించారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో 757కు చేరిన కరోనా కేసులు...మరో ఇద్దరు మృతి