ఆంధ్రప్రదేశ్

andhra pradesh

లాక్‌డౌన్: ప్రజలు బయటకు రావడంపై సీఎం జగన్ ఆందోళన

By

Published : Mar 24, 2020, 10:56 PM IST

Updated : Mar 24, 2020, 11:52 PM IST

కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో టాస్క్​ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచనలు చేశారు. లాక్‌డౌన్ విధించినా ప్రజలు గుమిగూడటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

cm jagan review
లాక్‌డౌన్ విధించినా ప్రజలు గుమిగూడటంపై సీఎం ఆందోళన వ్యక్తం

లాక్‌డౌన్: ప్రజలు బయటకు రావడంపై సీఎం జగన్ ఆందోళన

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించినా... ప్రజలు రోడ్లపైకి వస్తుండటంపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు చేపట్టాల్సిందిగా వైద్యారోగ్యశాఖ, పోలీసు అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణా చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్-19 నివారణ కోసం వైద్యారోగ్య శాఖ చేపట్టాల్సిన చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు.

ఇవీ చూడండి-లాక్​డౌన్ లెక్కచేయని వాహనదారులకు నోటీసులు

Last Updated : Mar 24, 2020, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details