ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM on Cyclone: సహాయ శిబిరంలో వ్యక్తికి వెయ్యి, కుటుంబానికి రూ.2 వేలు: సీఎం జగన్​

CM jagan on cyclone: 'అసని' తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. 'అసని' తుపానుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్​... తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

CM jagan on cyclone
'అసని' తుపానుపై సీఎం సమీక్ష

By

Published : May 11, 2022, 1:47 PM IST

CM jagan on cyclone: 'అసని' తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు.. సీఎం దిశానిర్దేశం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై పలు ఆదేశాలిచ్చారు. అప్రమత్తంగా ఉండాలని.. ఇప్పటికే నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమన్నారు. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశంగా అభిప్రాయపడ్డారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని తెలిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి, సీఎస్‌ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సహాయ శిబిరాలకు తరలించిన వ్యక్తికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని... కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. జనరేటర్లు, జేసీబీలు కూడా సిద్ధం చేయాలని సీఎం జగన్​ సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details